ఫౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన కారణంగా నార్వేకు చెందిన టూరిస్ట్ దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. నార్వేకు చెందిన జానే మెటే జోహన్ సన్ భారతదేశం చూడడానికి వచ్చి కేరళలోని కొచ్చిలో ఉంది. ఇటీవల జరిగిన పౌరసత్య వ్యతిరేక ర్యాలీలో ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆమెను హోటల్ కు పిలిపించిన ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులు ఆమె ఫేస్ బుక్ ఫోటోలు చూపించారు. వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
తన యోగ క్షేమ సమాచారాన్ని తెలుపుతూ తన కుటుంబసభ్యులకు ఇక్కడ జరిగిన ర్యాలీ ఫోటోను పెట్టాను తప్ప దానిలో ఎలాంటి దురుద్దేశం లేదని జోహన్ సన్ తెలిపారు. తాను చెప్పే దానిని..రాత పూర్వకంగా తాను వివరణ ఇస్తానన్నవినకుండా వెంటనే రిటర్న్ టిక్కెట్లు బుక్ చేసేకునేంత వరకు వదల్లేదని జోహన్ సన్ తెలిపారు. వెంటనే టిక్కెట్ బుక్ చేసుకోకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు చెప్పారు. తప్పని పరిస్థితుల్లో తన ఫ్రెండ్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నానంటూ ఫేస్ బుక్ లో పెట్టారు.
వారం రోజుల క్రితమే మద్రాస్ ఐఐటీలో చదివే జర్మనీ విద్యార్ది లింథెండల్ ను కూడా పౌరసత్వ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న కారణంగా దేశం నుంచి వెళ్లగొట్టారు.