బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్‌గా నిలిచిన అనంతరం అభిజిత్ ఆ గెలుపును ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు బిగ్‌బాస్‌లో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లకు నెమ్మదిగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే అభిజిత్ మాత్రం ఆఫర్ల మాట అటుంచితే ఇన్ని రోజుల పాటు హౌజ్‌లో ఉండి ఒత్తిడిగా ఫీలైనందుకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రిస్మస్ సందర్బంగా శాంటా క్లాజ్ గెటప్‌లో అలరించాడు.
క్రిస్మస్ సందర్భంగా అభిజిత్ శాంటా క్లాజ్‌గా మారి పేద చిన్నారులకు గిఫ్ట్‌లను అందజేశాడు. తాను హౌజ్‌లో ఉన్నప్పుడు తనకు ఎంతో మంది ఫ్యాన్స్ సపోర్ట్‌గా నిలిచారని, అందుకే ఇప్పుడు ఆ ఫేవర్‌ను మళ్లీ రిటర్న్ చేస్తున్నానని అభిజిత్ తెలిపాడు.
అయితే అభిజిత్ #SantaAbi పేరిట కార్యక్రం నిర్వహించగా దాన్ని నటుడు విజయ్ దేవరకొండకు చెందిన #DeveraSanta ప్రోగ్రామ్‌తో ఫ్యాన్స్ పోల్చారు. ఇక ఈ విషయంపై అభిజిత్ స్పందించాడు. తనకు విజయ్ దేవరకొండ కూడా ఇలా శాంటాలా గిఫ్ట్‌లను పంచిన విషయం తెలియదని అభిజిత్ అన్నాడు.
తాను బిగ్‌బాస్ హౌజ్ నుంచి 5 రోజుల కిందటే బయటకు వచ్చానని, విజయ్ దేవరకొండ కూడా శాంటాలా గిఫ్ట్‌లను ఇచ్చిన విషయం తనకు తెలియదని, తాను విజయ్‌ని కాపీ చేయడం లేదని అభిజిత్ అన్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కో స్టార్ విజయ్ తనకు మంచి స్నేహితుడని అన్నాడు. అయితే విజయ్‌ను కాపీ చేయడం లేదని చెప్పిన అభిజిత్.. శాంటా క్లాజ్ ప్రపంచంలో అందరికీ తెలుసని, అతను యూనివర్సల్ ఫిగర్ అని, అందువల్ల అతను అందరికీ చెందుతాడని అన్నాడు. అందుకనే తాను ప్రేమను అందరికీ పంచుతున్నానని తెలిపాడు.