రాష్ట్రపతి ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పోటీ చేస్తారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దాదాపు ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయినట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటి చేసే అంశంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో తాను లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు చేయడమే తనకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను ఆ పదవిలోనే కొనసాగుతానని ఆయన తేల్చి చెప్పారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అందుకోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తారని వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వాటిని ఎవరూ నమ్మవద్దని తెలిపారు.