కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యపై ఆప్ ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
ఇదే ట్వీట్ లో బీజేపీలో చేరే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘ నేను సోమవారం బీజేపీలో చేరడం లేదు. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా మీకు తెలియజేస్తాను’అని ట్వీట్ లో పేర్కొన్నారు.
‘ ఏ ప్రభుత్వమైనా అసమర్థుల చేతుల్లోకి వెళ్లడం ఎంత ఘోరమైనదో ఈ విచారకరమైన ఘటనతో పంజాబ్ ప్రజలు గ్రహించారు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
‘కొన్ని వారాల క్రితం అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్, ఇప్పుడు సింగర్ సిద్దూ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు పలు ప్రశ్నలను రేకెతిస్తున్నాయి’అని అన్నారు.
ప్రజలను బాధపెట్టే మరో కాంగ్రెస్ లాగా ఆప్ మారాలనుకుంటోందా లేక ప్రజలకు ఏదైనా మంచి చేసే పార్టీలాగా ఉండాలనుకుంటోందా ముఖ్యమంత్రి, ఆ పార్టీని నడిపించే ఢిల్లీ నాయకులు ఆలోచించుకోవాలన్నారు.