బిర్బూమ్ లో 8 మంది సజీవదహనం ఘటనలో తనను బీజేపీ టార్గెట్ చేయడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్దారు. ప్రతిగా బీజేపీపై ఆమె నిప్పులు చెరిగారు.

‘ గతంలో ఇలాంటి ఘటనలు గుజరాత్, రాజస్థాన్ లోనూ జరిగాయి. అలాని నేను ఈ ఘటనను నేను సమర్థించడం లేదు. కానీ ఈ ఘటనపై ఖచ్చితంగా న్యాయమైన పద్ధతిలో చర్యలు తీసుకుంటాను’ అని వెల్లడించారు.
‘ ప్రభుత్వం మనది. రాష్ట్రంలోని ప్రజల గురించి మాకు ఆందోళన ఉంది. ఎవరో బాధపడాలని మేము ఎప్పుడూ కోరుకోము. బీర్భూమ్, రాంపూర్‌హాట్ ఘటన దురదృష్టకరం. రాంపూర్‌హాట్‌లోని ఆఫీసర్ ఇన్‌ఛార్జ్, సబ్-డివిజనల్ పోలీసు అధికారిని తొలగించాను. నేను రేపు రాంపూర్‌హట్‌కి వెళతాను’ అని ముఖ్యమంత్రి అన్నారు.