సొంత తండ్రి వల్లే తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ సినీ నటి ఖుష్భూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై పలు కామెంట్స్ రాగా.. తాజాగా ఆమె మళ్లీ రియాక్ట్ అయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్పినందుకు తాను ఏ మాత్రం సిగ్గుపడటం లేదన్నారు.
నాకు జరిగిన వేధింపుల గురించి ధైర్యం చేసి నిజాయితీగా అందరికీ తెలిసేలా చేశాను.. ఇందులో ఆశ్చర్యానికి లోనవడానికి ఏమీ లేదు.. ఈ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదని తెలిపారు.
నాపై ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తి సిగ్గుపడాలన్నారు. మహిళలందరూ ధైర్యంగా ముందుకు రావాలని ఆమె స్పష్టం చేశారు. మిమ్మల్ని కించపరిచే వారిని ప్రోత్సహించకూడదన్నారు ఖుష్బూ.
కాగా ఇటీవల ఝార్ఖండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఖుష్బూ ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలిపారు. ‘మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంది.. అమ్మను, నన్ను కొట్టేవాడు.. నాకు 8 ఏళ్లప్పుడే నన్ను లైంగికంగా వేధించాడు.. 15 ఏళ్ల వయస్సులో ఆయన్ని ఎదిరించే ధైర్యం వచ్చిందన్నారు. ఆ తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడంటూ’ సినీ నటి ఖుష్బూ చెప్పుకొచ్చారు.