ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ టీఆర్ఎస్.. గెలుపు కోసం దొడ్డిదారిలో దొంగ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ఏకంగా పోలింగ్ కేంద్రాల వద్దే ప్రలోభాల పర్వానికి తెరతీసినట్టుగా తెలుస్తోంది.కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు.. టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కయి బ్యాలెట్ పేపర్లను ముందుగానే బయటకు పంపిస్తున్నట్టుగా కొందరు పట్టభద్రులు చెప్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గడిలో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి తిరిగి ఆ బ్యాలెట్ పేపర్‌ను బాక్స్‌లో వేస్తే రూ. 5 వేలు స్పాట్‌లో ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. విధుల్లో ఉన్న అధికారులు కూడా ఇందుకు సహకరించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు.