చికెన్, మటన్, ఫిష్, పప్పు దినుసులు వంటివి తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన కొంత పీచు పదార్థం దంతాలలో ఇరుక్కుపోతూ ఉంటుంది. దానిని తీసేందుకు చాలామంది అష్ట కష్టాలు పడుతుంటారు. అందుకోసం ముఖ్యంగా టూత్ పిక్ లను వాడుతారు. అయితే ఇవి రెండు రకాలుగా ఉంటాయి.
ఒకటి ప్లాస్టిక్ తో చేసినవి, రెండు చెక్కతో చేసింది. చెక్కతో చేసిన టూత్ పిక్ లు విరిగిపోతాయి. ఇది చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఇక ప్లాస్టిక్ టూత్ పిక్ విరగదు. వీటి ధర ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఎవరి స్తోమత కి తగ్గట్టు వాళ్ళు ఇవి వాడుతుంటారు. హోటల్స్ కి వెళ్లేటప్పుడు మాత్రం బిల్ ఇచ్చే సమయంలో వీటిని ఇస్తూ ఉంటారు.
కొరటాల శివ సినిమా హీరోలలో ఫాలో అవుతున్న ఒకే సెంటిమెంట్ ఇది గమనించారా ?
నిజానికి మనం ఈ టూత్ పిక్ ను చాలా సార్లు వాడే ఉంటాం కానీ… ఒక విషయం సరిగ్గా గమనించం. దాని కింది భాగంలో పదునుగా ఉంటుంది. అది దంతాల సందుల్లోకి సులభంగా వెళుతుంది. మధ్య లో ఇరుక్కున్న ఆహార పదార్థాలను బయటకు తీయగలుగుతుంది.
నిహారిక ఇష్యూపై స్పందించిన తల్లి పద్మజ… మాకు మా బావగారున్నారు!!
అలాగే దాని పై భాగంలో చెక్కినట్లు కూడా ఉంటుంది. దాన్ని చాలామంది చూసినప్పటికీ పెద్దగా పట్టించుకోరు. అలా చేయటం వెనుక ఒక కారణం ఉందట. పైభాగాన్ని కొంత మేర విరిచి టేబుల్ మీద పెడితే దానిపై టూత్ పిక్‌ను పెట్టుకోవచ్చని దీంతో టూత్ పిక్‌ను టేబుల్ మీద నేరుగా పెట్టాల్సిన పని ఉండదని ఇలా చెయ్యటం వల్ల దాన్ని మళ్లీ మనం ఉపయోగించుకోవచ్చని అలా చేశారట.