ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నోటీసులు రావడం కేవలం సినిమా టైటిల్స్ మాత్రమేనని వ్యాఖ్యానించారు మాజీ ఐఏఎస్, బీజేపీ నేత చంద్రవదన్. ఈ సందర్భంగా ఆయన గురువారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మట్లాడారు. లిక్కర్ స్కామ్ ప్రాథమిక దశలో ఉందన్నారు. నోటీసులు కేవలం సినిమా టైటిల్స్ గా ఆయన పోల్చారు. అసలు సినిమా మొదలైతే కేసు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందన్నారు.
ఎక్సైజ్ మాజీ కమిషనర్ గా తాను చెబుతున్నానని, ఈ కేసు ఎవరూ ఊహించని విధంగా మలుపు తిరుగుతుందని తెలిపారు. కేసు నుంచి బయటకు రావచ్చని భావిస్తున్నారు. కానీ అదంతా భ్రమ అని మాజీ ఐఏఎస్ చంద్రవదన్ పేర్కొన్నారు. గుజరాత్ ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణపై కూడా పడుతుందన్నారు.
రాష్ట్రంలో 37 మంది ఐఏఎస్ అధికారులు ప్రాధాన్యత కలిసిన పోస్టుల్లో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రంలో పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మండిపడ్డారు.తెలంగాణలో బ్యూరో క్రాట్స్ స్వచ్ఛందంగా పని చేసుకునే అవకాశం లేకుండా పోయిదని విమర్శించారు.
కేవలం ఒక పార్టీ చెబితే వినాల్సిన పరిస్థితి బ్యూరో క్రాట్లకు దాపరించిందన్నారు. ఇతర రాష్ట్రాలకు డిప్యూటేషన్ పై వెళ్లేందుకు వారు మొగ్గుచూపుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా మారుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.