కాంగ్రెస్ నేత మల్లు రవికి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో భాగంగా మల్లు రవికి మరోసారి నోటీసులు అందాయి. తెలంగాణ గళం వెబ్ పేజ్లో అనుచిత పోస్టింగ్స్ చేశారంటూ మహేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. హైదరాబాద్ లోని గాంధీభవన్ కు వెళ్లి సీఆర్పీసీ 41ఏ నోటీసులను సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు అందించారు. అంతకుముందు కూడా ఈ కేసుకు సంబంధించి మల్లు రవికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు అందాయి.
ఆ సమయంలో విచారణకు వెళ్లిన ఆయన కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేసిన సమయంలో.. వార్ రూమ్ కు తానే ఇన్ ఛార్జ్ నని తెలిపారు.
కాంగ్రెస్ వార్ రూమ్ లో కేవలం వ్యూహాలు మాత్రమే రూపొందించుకుంటామని ఆయన పోలీసులకు చెప్పారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వడంపై మల్లు రవి ఎలా స్పందిస్తారనేది చూడాలి.