డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇందులో ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు.పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా… తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది.