భారత్ లో కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ యూనిర్సిటీ-ఆస్ట్రాజెనికా సంయుక్తంగా రూపోందించిన కోవిషీల్డ్ కు భారత వ్యాక్సిన్ నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనిపై భారత ఔషధ నియంత్రణ సంస్థ ఒకే చెప్పగానే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
అయితే, కోవిషీల్డ్ తో పాటు పూర్తి దేశీయ టెక్నాలజీతో భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ సంయుక్తంగా రూపోందించిన కోవాక్జిన్ కు కూడా భారత వ్యాక్సిన్ నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కోవిషీల్డ్ కోసం సీరమ్ సంస్థ, కోవాక్జిన్ కోసం భారత్ బయోటెక్ సంస్థలు అత్యవసర వ్యాక్సినేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా… ఇప్పటికే సీరమ్ సంస్థకు ఆమోదముద్ర పడింది. శనివారం కోవాక్జిన్ డేటాను నిపుణుల కమిటీ పరిశీలించనుంది.
అయితే, మూడోదశ క్లినికల్ ట్రయల్స్ లో ఇప్పటికే 26వేల మందిపై కోవాక్జిన్ ట్రయల్స్ విజయవంతం అయిన నేపథ్యంలో భారత్ బయోటెక్ కు కూడా ఆమోదం వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది.