ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేదికపై సందడి చేయబోతోంది. ఈ సినిమాలో నాటు-నాటు సాంగ్ కు అవార్డ్ వస్తుందో రాదో ఇప్పుడే చెప్పలేం కానీ.. ఆర్ఆర్ఆర్ హీరోల హంగామా మాత్రం అమెరికాలో ఓ రేంజ్ లో నడుస్తోంది.
మొన్నటివరకు చరణ్ హంగామా నడిచింది. అక్కడి టీవీ ఛానెళ్లతో చర్చలు, సెలబ్రిటీ పార్టీలు, ఫొటోషూట్స్, ప్రీమియర్స్ తో బిజీబిజీగా గడిపేశాడు చరణ్. ఆర్ఆర్ఆర్ అంటే చరణ్ అనేంతలా ప్రచారం చేశారిక్కడ. అదే టైమ్ లో ఎన్టీఆర్ ను విస్మరించారంటూ విమర్శలు కూడా వచ్చాయి.
ఈ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ లో ల్యాండ్ అయ్యాడు. ఇలా ల్యాండ్ అవ్వడం ఆలస్యం, అలా తన పవర్ చూపిస్తున్నాడు. యూఎస్ లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు తారక్. ఆస్కార్ అవార్డుల సంబరానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైమ్ ఉన్న నేపథ్యంలో.. తన మార్క్ హంగామా చూపిస్తున్నాడు.
చరణ్ తో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే, సోలోగా తను కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆమధ్య అమెరికా వెళ్లినప్పుడు అమెరికన్ యాస మాట్లాడి అక్కడి మీడియాను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఈసారి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు.