ఎస్ఈసీ నిమ్మగడ్డపై జగన్ సర్కార్ చివరి అస్త్రాన్ని ప్రయోగించనుందా….? మంత్రి పెద్దిరెడ్డిని టచ్ చేయటం ద్వారా జగన్ ను రాజకీయంగా టార్గెట్ చేసినట్లు వైసీపీ ఫిక్స్ అయ్యిందా…? మొన్న ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ వ్యవహరించిన తీరుకు బదులివ్వాలని డిసైడ్ అయ్యిందా…?
జగన్ సర్కార్ తో ఆధిపత్య పోరులో నిమ్మగడ్డపై పైచేయి సాధించేందుకు అధికార వైసీపీ అస్త్రాలను సిద్ధం చేసింది. ఇప్పటికే మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపగా… కమిటీ భేటీ అయి, మరోసారి చర్చించాలని వాయిదా వేస్తూ నిర్ణయించింది. ఈ ప్రివిలేజ్ కమిటీ ఇష్యూతో నిమ్మగడ్డ మెత్తబడతారని వైసీపీ భావించింది. కానీ ఎస్ఈసీ మాత్రం మరో అడుగు ముందుకేసి వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డిపై తీవ్ర ఆంక్షలు విధించారు. దీంతో ఇక ఆయన్ను వదిలేది లేదని ఫిక్సయ్యింది.
నిమ్మగడ్డ ఆంక్షలు విధించిన సమయంలోనూ, హైకోర్టు ఆంక్షలను సడలించిన సమయంలోనూ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ స్పందించారు. ఆయన నిర్ణయాలను ఆయన అమలు చేయాలని చూశారని, కోర్టు సడలించిందన్నారు. కానీ అసెంబ్లీ, ప్రివిలేజ్ కమిటీ తీసుకునే నిర్ణయాలను కోర్టులు కూడా సవరించలేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హెచ్చరికలేనన్న అభిప్రాయం పొలిటికల్ గా వినపడుతుంది. ప్రివేలజ్ కమిటీతో నిమ్మగడ్డకు చెక్ పెట్టబోతున్నారని, అవసరం అయితే ఆయనకు జైలు శిక్షకు కూడా కమిటీ సిఫార్సు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.