ఇంగ్లీష్ మీడియంపై ఏపీ రాజకీయాల్లో మాటల దాడి కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు హాయంలోనే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు శ్రీకారం చుట్టామని, 78జీవో కూడా ఇవ్వటంతో పాటు జీవో 14ద్వారా ఇంగ్లీష్ పరిజ్ఞానం పెంచేలా టీచర్స్‌కు శిక్షణ ఇచ్చామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ. ఆనాడు జగన్, ఆయన పత్రిక మాతృభాషకు మంగళం అని ప్రచారం చేసి… ఈరోజు మీరు చేసిందేమిటి అని ప్రశ్నించారు.
ముందస్తు ప్రణాళిక లేకుండానే సొంత ఎజెండాతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇంగ్లీషు భాష బోధించడానికి టీచర్లు సమాయత్తం చేయకపోతే పిల్లలకు ఏం చెబుతారని ప్రశ్నించారు.
అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరి జీవో ఎంటీ…? విద్యాశాఖపై చర్చకు సిద్ధం అంటూ ప్రకటించారు.