మీరు యాపిల్‌కు చెందిన ఐఫోన్ 11 ఫోన్‌ను వాడున్నారా ?తు ఈ మధ్య కాలంలో ఫోన్ స్క్రీన్ సరిగ్గా పనిచేయడం లేదా ? టచ్ చేసినా కొన్ని సార్లు రెస్పాన్స్ రావడం లేదా ? అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే యాపిల్ ఇప్పుడు అలాంటి ఫోన్లకు ఉచితంగా స్క్రీన్ ను మార్చి ఇస్తోంది. కనుక మీరు ఆ ఆఫర్‌కు ఎలిజిబుల్ అయితే వెంటనే మీ ఐఫోన్ 11 ఫోన్‌కు చెందిన స్క్రీన్ ను ఉచితంగా మార్చుకోవచ్చు.
సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఐఫోన్ 11 ఫోన్లకు చెందిన స్క్రీన్ లు సరిగ్గా పనిచేయడం లేదని తన సపోర్ట్ పేజీలో తెలిపింది. కొన్ని ఐఫోన్ 11 మోడల్స్ కు చెందిన స్క్రీన్ లు టచ్‌కు సరిగ్గా రెస్పాండ్ అవడం లేదని తెలిపింది. నవంబర్ 2019 నుంచి మే 2020 మధ్య ఉత్పత్తి అయిన ఐఫోన్ 11 ఫోన్లలోనే ఈ సమస్య వస్తుందని నిర్దారించింది.
అయితే ఐఫోన్ 11 ఫోన్లను వాడుతున్న వారు తమకు కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుంటే వెంటనే వారు ఈ ఆఫర్‌కు అర్హులో, కాదో చెక్ చేసుకోవచ్చు. అందుకు గాను వారు యాపిల్ సపోర్ట్ పేజీ (https://support.apple.com/iphone-11-display-module-replacement-program)లో తమ ఐఫోన్ 11కు చెందిన సీరియల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఈ ఆఫర్‌కు ఎలిజిబిలిటీని చెక్ చేయవచ్చు. అందులో ఎలిజిబుల్ అని వస్తే యాపిల్ లేదా యాపిల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌లో తమ ఐఫోన్ 11 ఫోన్‌కు ఉచితంగా స్క్రీన్ ను మార్పించుకోవచ్చు.
ఇక ఐఫోన్ 11కు గాను సీరియల్ నంబర్‌ను తెలుసుకోవాలంటే యూజర్లు ఫోన్‌లోని సెట్టింగ్స్ ను ఓపెన్ చేసి అందులో జనరల్ విభాగంలో ఉండే అబౌట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో ఫోన్‌కు చెందిన సీరియల్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని పైన తెలిపిన లింక్‌లో ఎంటర్ చేసి ఈ ఆఫర్ లభిస్తుందో, లేదో చెక్ చేయవచ్చు.
అయితే ఇప్పటికే స్క్రీన్ పగిలిపోయి ఉన్నవారు ఈ ఆఫర్‌కు అనర్హులు. వారు కొంత ఫీజు చెల్లించి స్క్రీన్ ను మార్పించుకోవచ్చు. ఇక ఈ ఆఫర్ కేవలం ఐఫోన్ 11కు మాత్రమే వర్తిస్తుంది. ఐఫోన్ 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్‌లకు వర్తించదు.