తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరింది. ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై గత నెల 18న.. సీపీఐ నారాయణ ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. కార్మికుల మరణాలు మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. నారాయణ ఫిర్యాదు ఆధారంగా జాతీయ మానవహక్కుల సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.