డా.లోకేష్ బాబు
భారతదేశం
భారతదేశంలో ఇప్పుడున్న మోదీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ అబద్ధాపు పునాదులపై ఏర్పడ్డాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం భారతదేశాన్ని కాగితపు రిపబ్లిక్ అనేందుకు నేను ఏ మాత్రం వెనుకాడబోను.
ఇండియాలో 2018 నుంచి 2019 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో మోసం జరిగింది. దాని గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఆధారాలతో ఈ-మెయిల్ రూపంలో దాదాపు 21 లేఖలు పంపాను. ప్రత్యక్షంగా అందరిముందు ఈవీఎంలను ట్యాంపరింగ్ (Live EVM Tampering Demo) చేయగలమని మేం చేసిన సవాల్‌కు ఇంకా సమాధానమే రాలేదు. మా ప్రతిపాదన కేంద్ర ఎన్నికల సంఘం సొరుగులో ఇంకా మూలుగుతూనే ఉంది. అందుకే నేను ఈ ఎన్నికలను మోసపూరితమని, వెనిజులా దేశపులాంటి “బనానా ఎలక్షన్స్” గా అభివర్ణిస్తున్నాను.
2019 మే 28న “The Hindu” పత్రికకు రాసిన ఓ వ్యాసంలో ఆర్ఎస్ఎస్, అలాగే మోదీ ప్రభుత్వం కలిసి ఎలక్షన్లలో ఎలా మోసం చేశాయో సోదాహరణంగా వివరించాను.అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కూ లేఖ రాశాను. అది కూడా అతీగతీ లేదు. వీటితో మరోసారి India is a Banana Republic అని చెప్పడంలో సందేహం లేదు.
భారతదేశంలోని నేటి మోదీ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిరంకుశ(fascist) ప్రభుత్వాలు. పత్రికా స్వాతంత్ర్యాన్ని ఉక్కుపాదాల కింద తొక్కేస్తున్నాయి. ఇక్కడి సమాచార మాధ్యమాలకు ఎలాంటి స్వేచ్చా హక్కులు లేవు. విలేకర్లను, సామాజిక మాధ్యమాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశాన్ని ఓ పోలీసు రాజ్యంగా మార్చివేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని పాలిస్తున్నాయి. చివరకు ఫిప్త్ ఎస్టేట్ అయిన సామాజిక మాధ్యమాల్లో(Facebook, Twitter, whatsapp, Google, ticktok) అభిప్రాయాలు వెలిబుచ్చినా.. సహించలేక భారత దేశ పౌరులను జైళ్లలో పెట్టి వేధిస్తున్నాయి. దేశంలో లంచం లేకుండా చిన్న సేవ కూడా లభించడం లేదన్నది చేదు వాస్తవం. ఇక ప్రతిపక్షంలోని ప్రతి రాజకీయ నాయకుడిని CBI, NIA, ED, Income Tax వంటి ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా బెదిరింపులకు గురిచేస్తోంది మోదీ ప్రభుత్వం. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారినెవరినైనా దేశ ద్రోహులుగానో, తీవ్రవాదులుగానో, అర్బన్ నక్సలైట్లుగానో, లేదా అరాచకవాదులుగానో ముద్రవేసి వేధింపులకు గురి చేస్తోంది.
మోదీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల తొత్తులు భారతీయ రిజర్వ్ బ్యాంకును, ప్రభుత్వ , ప్రైవేట్ బ్యాంకులను రకరకాలుగా కొల్లగొట్టి సంపాదించిన సుమారు 0.5 ట్రిలియన్ డాలర్ల సొమ్మును కొంత నేరుగాను, మరికొంత హవాలా మార్గాల్లోను అమెరికా అలాగే ఇతర 23 ఇతర దేశాలకు తరలిస్తున్నారు.ఈ చర్యలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇతర దేశాలకు తరలించిన ఈ ధనం తిరిగి ఎన్నో రూపాలలో వీరికి కావాల్సిన మేలు చేయడం.. ఎన్నికల్లో గెలిచేందుకు నిధులు అందించడంలోనో, ప్రచార రూపంలోనో తిరిగి వస్తున్నాయి. వీటికి నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అమెరికా, ఫ్రాన్స్, రష్యా ,చైనా దేశాలతో జరిపిన రక్షణ రంగ కొనుగోలు లావాదేవీలలో భారీ ఎత్తున అవినీతి జరిగి నగదు చేతులు మారింది. చివరికి కోవిడ్-19 దేశవ్యాప్తంగా నాసిరకం పరీక్షలు చేసి WHO వంటి సంస్థలకు తప్పుడు లెక్కలు సమర్పించింది మోదీ ప్రభుత్వం.
మోదీ ప్రభుత్వం & రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలనా విధానాలకు వ్యతిరేకంగా నేను చేస్తున్న హెచ్చరికల్ని భారతీయులు పెడచెవిన పెట్టి, ఈ దోపిడీదారులకు, కరుడుగట్టిన నేరస్తులకు వ్యతిరేకంగా ఉద్యమించకుంటే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలడం, రాజకీయ అస్థిరత వంటి అనేక తీవ్ర పరిణామాల్లో కూరుకొనిపోయి దేశం చిన్నాభిన్నమైపోయే ప్రమాదం ఉంది. పైన నేను పేర్కొన్న వాస్తవాలన్నీ కేవలం నీటిలో మునిగివున్న మంచు పర్వత శిఖరాగ్రమంత మాత్రమే. తెలియవలసింది ఇంకా చాలా చాలా ఉంది. ఈ క్రమంలోనే మోదీ ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలు, దోపిడీకి వ్యతిరేకంగా భారతీయుల్ని పోరాటం దిశగా ఏకం చేసేందుకు నా మాతృదేశాన్నే కాక ఈ ప్రపంచాన్ని రక్షించుకొనేందుకు “నేను ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాను”. మనమంతా గళం విప్పి ఒక్కతాటిపై నిలిచి మనదేశాన్ని మనమే కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సాధన కోసం నేను చేపట్టిన దీక్ష ద్వారా నా ప్రాణత్యాగంతోనైనా నా దేశాన్ని రక్షించుకోవడానికి నేను సిద్ధం. మరి మీరూ?