మునుగోడు నియోజకవర్గ చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ప్రజా స్వామ్య పరిరక్షణకై పాదాభివందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఆ నామినేషన్ ర్యాలీలో NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి సారధ్యంలో సుమారు 1000 మందితో కూడిన తెలంగాణ NSUI బృందం… ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మునుగోడులో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే శనివారం కూడా మునుగోడు నియోజకవర్గ అన్ని మండల కేంద్రాలకు NSUI నాయకులు బృందాల వారీగా చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ పట్టణంలో NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి, NSUI చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చౌటుప్పల్ ప్రజల కాళ్ళు మొక్కుతూ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను మునుగోడు నియోజకవర్గ ప్రజలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.