రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రంలో ఉద్రిక్త వాతారణం ఏర్పడింది. అతన్ని సీఎం పదవి నుండి తొలగించాలంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని పలువురు అగ్ర నేతలను ఇప్పడికే ముందస్తు అరెస్టులు చేశారు. మరికొందరిని హౌజ్ అరెస్టులు చేశారు పోలీసులు.
నిరసన కార్యక్రమాల్లో భాగంగా బషీర్ బాగ్ లోని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని ఎన్ఎస్ యూఐ నేతలు ముట్టడించారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు.. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తో పాటు.. పలువురి కార్యకర్తలను అరెస్టు చేశారు.
వెంకట్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం ముఖ్యమంత్రి బిస్వా శర్మపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం హోదాలో ఉండి దేశంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లడటం సరికాదన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోదండ రెడ్డి, అంజన్ కుమార్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసి నారాయణ గూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.