తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నోటిఫికేషన్ల కోసం ధర్నాకు దిగారు. బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ లో వచ్చి అసెంబ్లీని ముట్టడించేందుకు చూశారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు. అయితే.. అసెంబ్లీ ముందు దిగిన వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. కాసేపు పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు వెంకట్. అలాగే కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
మరోవైపు ఓయూ జాక్ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరసనకు దిగింది. చైర్మన్ అర్జున్ నాయక్.. సీఎం కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తున్న మార్గంలో రోడ్డుపై నల్ల జెండాతో నిరసన తెలిపారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.