తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే ఎంట్రెన్స్ పరీక్షలకు ప్రభుత్వం సిద్ధమవటంపై కాంగ్రెస్ అనుబంధ స్టూడెంట్ యూనియన్ ఎన్.ఎస్.యూ.ఐ మండిపడింది. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సీఎం అధికార నివాసం అయిన ప్రగతి భవన్ ను ముట్టడించింది. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని, ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు వేచి ఉండకుండా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పై తేదీలు నిర్ణయించటంపై ఎన్. ఎస్.యూ.ఐ మండిపడింది. ప్రగతి భవన్ లో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కోసం మంత్రులు ప్రగతి భవన్ కు చేరుకుంటున్న సమయంలో ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు ముట్టడికి రావటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ ల సమయంలో కొందరు విద్యార్థులపై పోలీసులు చేయి చేసుకోవటం, రోడ్డుపై లాక్కెళ్లటంపై ఎన్.ఎస్.యూ.ఐ తీవ్రంగా మండిపడుతోంది.