తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై ఎన్‌ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ అన్నారు. కమలాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీఆర్ ఎస్ పార్టీ తీరును తప్పుపడుతూ స్థానిక లీడర్లు, ఎమ్మెల్సీ కౌశిక రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాత రిబ్బన్ కట్చేసి పోయిండని విమర్శించారు.
పాత పనులు ప్రారంభించి నియోజకవర్గ ప్రజల్ని ఈ రకంగా మోసం చేసిపోతారని ఎన్నడూ భావించలేదన్నారు. కమలాపూర్ లో డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని స్థానిక బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసిన విషయాన్ని మంత్రికి విన్నవించేందుకు వెళ్లిన ఎన్ఎస్యూ లీడర్లపై దాడులు చేసి, గాయపరచడం సిగ్గుచేటు అన్నారు.
రౌడీల్లా వ్యవహరించి లీడర్లను అడ్డుకొని స్టేషన్కు తరలించి కేసులు పెట్టడం సబబు కాదన్నారు. మంత్రి కేటీఆర్ టూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చినట్లు లేదని ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రకటన కోసం వచ్చినట్లు ఉందన్నారు.
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమకారులపై రాళ్లు రువ్విన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.