తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్… ఎన్టీఆర్ అంటే తెలుగు సినిమా అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో భారీ ఫాలోయింగ్ పెంచుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్… ప్రజలకు చేరువయ్యే నిర్ణయాలతో దేశం మొత్తాన్ని తన వైపుకి తిప్పుకున్నారు. ఇక ఆయన ప్రవేశ పెట్టిన పది పథకాలు అయితే అప్పటి వరకు రాజకీయం చేసిన వాళ్ళను కూడా విస్మయానికి గురి చేసాయి.

Also Read:జాతిరత్నాలు డైరెక్టర్ కొత్త సినిమా స్టార్ట్
2 రూపాయలకు కేజీ బియ్యం
అప్పటి వరకు ప్రజలకు బియ్యం అంటే డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే తినే ఆహారంగా ఉండేది. రాగి సంగటి పచ్చి పులుసు గతి. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
మద్యపాన నిషేధం
కేవలం గుజరాత్ లో మాత్రమే వినపడే మాటను ఏపీలో కూడా వినిపించి పేదవాడికి మద్యాన్ని దూరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎంసెట్
ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోసం పెట్టె ఈ ప్రవేశ పరీక్షను తీసుకొచ్చింది ఎన్టీఆర్.
పటేల్ పట్వారి విధానం రద్దు
గ్రామ భూముల రెవెన్యూ వ్యవస్థను తమ చేతుల్లో పెట్టుకుని పేద రైతులను అనేక కష్టాలకు గురి చేసే పటేల్, పట్వారీల అధికారాలను ఎన్టీఆర్ రద్దు చేసారు. ఇది తెలంగాణాలో ఇప్పటికీ సంచలనమే.
మహాత్మ గాంధీ బస్టాండ్
మన అందరికి ఎంజీబీఎస్ గా తెలిసిన ఈ బస్టాండ్ ను ఆ రేంజ్ లో ముందుకు తీసుకు వెళ్ళింది ఎన్టీఆర్. ఇమ్లీబన్ బస్టాండ్ గా నిజాం కాలంలో ఉన్న బస్టాండ్ ను ఆసియ లోనే పెద్ద బస్టాండ్ గా రూపొందించారు ఎన్టీఆర్.
నెక్లెస్ రోడ్ లో తెలుగు ప్రముఖుల విగ్రహాలు
తెలుగు భాష కోసం, తెలుగు ప్రజల కోసం కృషి చేసిన వారి విగ్రహాలను నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసారు. హుస్సేన్ సాగర్ లో ఉండే బుద్ధుడి విగ్రహం కూడా ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేసిందే. వీటి ద్వారా తెలుగు సంస్కృతి, చరిత్రను మనకు తెలిసే విధంగా ఏర్పాటు చేసారు.
5 లక్షల ఇళ్ళ నిర్మాణం
పేదలకు కూడు గుడ్డ, గూడు అనే అంశం మీద ఎంతో కష్టపడిన ఎన్టీఆర్… తన పాలనలో దాదాపుగా 5 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టారు.
మండలి రద్దు
ప్రభుత్వానికి వృధా ఖర్చుగా భావించే శాసన మండలిని రద్దు చేసి సంచలనం సృష్టించడం దేశం మొత్తాన్ని ఆకర్షించింది.
స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం
ఇది దేశం మొత్తం ఎన్టీఆర్ పేరు వినపడేలా చేసింది. విద్యార్ధులకు చదువుకోవడానికి అన్ని వసతులు ఉండాలని భావించిన ఎన్టీఆర్… పేద విద్యార్ధులు ఆహారం కోసమా అవస్థలు పడవద్దనే ఉద్దేశంతో… ఈ పథకం రూపకల్పన చేసారు. ఇప్పటికీ ఇది మార్పులు చేర్పులతో విజయవంతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్
పేదవాడు కూడా పదవికి అర్హుడే, వెనుకబడిన కులాలు కూడా పెత్తనం చేలాయించాలి అనే ఉద్దేశంతో అడుగులు వేసిన ఎన్టీఆర్… స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకొచ్చి… ఎందరో వెనుకబడిన వారి నాయకులుగా ముందుకు నడిపించారు. ఇప్పటికీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు.
తెలుగు సినిమా
మద్రాస్ వీధుల్లో దిక్కు లేకుండా తిరుగుతున్న తెలుగు సినిమాకు ఒక గౌరవ ప్రదమైన స్థానం కల్పిస్తూ… రాజధాని హైదరాబాద్ కు సినిమా పరిశ్రమను తీసుకొచ్చారు.
Also Read:జనగామ లో భారీ బహిరంగ సభ..లక్షకు పైగా ప్రజలు..!