యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్ లతో మంచి జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో తన తరువాత సినిమా ఉండబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాని హారిక,హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని మొదట దర్శక నిర్మాతలు భావించినప్పటికీ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో అది సాధ్యపడేలా కనిపించట్లేదు. మరో వైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఇంకా అవ్వలేదు. ee నేపథ్యంలోనే 2021 లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడట త్రివిక్రమ్.