యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ ను వాయిదా వేసుకుని ఏప్రిల్ లో రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తరువాతి సినిమాల పై ఫోకస్ పెట్టాడు. ఆ లిస్ట్ లో కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సాన లు ఉన్నారు. అందులో మొదటగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో మొదటి నుంచి కూడా అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించబోతున్నారట. కాగా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ముహూర్తపు షాట్ ను ఫిబ్రవరి 7న ప్లాన్ చేశారట. కరోనా కట్టడి అయితే ఆ కొద్దీ రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ కూడా జరపనున్నారట. ఇక ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
గతంలో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమంత, నిత్య మీనన్ హీరోయిన్స్ గా నటించగా మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు.