దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. కరోనా కారణంగా షూటింగ్స్ ఆలస్యం అవుతున్నా… జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో 50రోజులకు పైగా నైట్ షెడ్యూల్ పూర్తి చేసిన ఆర్.ఆర్.ఆర్ టీం, చిన్న బ్రేక్ తీసుకుంది.
ఇప్పుడు మహాబలేశ్వరంలో ఓ షెడ్యూల్ షూట్ చేయనున్నారు. వారం క్రితమే ఈ షెడ్యూల్ కోసం రాంచరణ్, ఎన్టీఆర్ లు చెన్నై వెళ్లగా… ఇప్పుడు షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని ఆర్.ఆర్.ఆర్ టీం స్వయంగా అభిమానులతో పంచుకుంది.
ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ అంతా పుణే షిఫ్ట్ కానుంది. ఇక్కడ రాంచరణ్, ఎన్టీఆర్ పై షూట్ తో పాటు అలియా భట్ కూడా జత కలవనుంది.
It's time to hustle!
A very short schedule in and around the beautiful locales of Mahabaleshwar with @tarak9999 & @AlwaysRamCharan is underway at a brisk pace 🙂#RRRMovie #RRRDiaries pic.twitter.com/XkOQ3NW0db— RRR Movie (@RRRMovie) December 3, 2020