త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంభినేషన్ లో మరో సినిమా రాబోతుందన్నది పాత వార్తే. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తైతే త్రివిక్రమ్ తో సినిమా సెట్స్ పైకి వచ్చేది. కానీ కరోనా కారణంగా ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. దీంతో సినిమా ఉంటుందా… ఉండదా అన్న చర్చ మొదలైపోయింది.
ఎన్టీఆర్ 30వ రాబోతుందని, త్వరలో కీలక ప్రకటన ఉంటుందని హారికా హాసిని క్రియేషన్స్ ప్రకటించింది. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి సినిమా నిర్మిస్తున్నట్లు తెలిపింది. గతంలో చేసిన ఈ ప్రకటనను తాజాగా హారికా హాసిని క్రియేషన్స్ ట్యాగ్ చేయటంతో మరోసారి ఈ సినిమా చర్చ తెరపైకి వచ్చింది.
హారికా హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పాత పోస్టునే ట్యాగ్ చేయటంతో ఈ సినిమా పక్కనపెట్టేశారన్న వార్తలను కొట్టిపారేసినట్లయింది.