సినిమా విషయంలో నేటి తరం హీరోలకు రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందో… రెమ్యునరేషన్లు కూడా అదేరేంజ్ లో ఉంటోంది. ఉదాహారణకు పుష్ప సినిమాకు బన్నీకి 75 కోట్ల రూపాయలు ముట్టాయని, బాహుబలి సినిమా నిమిత్తం ప్రభాస్ కు రూ.100కోట్లు దక్కాయని సమాచారం.
మరీలెక్కన చిన్నా చితకా హీరోల విషయానికి కొస్తే వీరంత కాకపోయినా కోట్లల్లో అయితే రేట్లు ఉంటాయనేది కన్ఫమ్. ఇప్పుడు ఎవర్ని కదిపినా కోట్లు అంటున్నారు కదా..! ఒకప్పటి హీరోలైన NTR, ANR, కృష్ణ, శోభన్ బాబులకు ఎంతెంత పారితోషకాలు ఇచ్చేవారో తెలుసుకోవాని వారి వారి అభిమానుల్లోనే కాదు, మామూలు జనానికి కూడా ఆసక్తి ఉంటుంది.
NTR
అప్పట్లో NTR తో సినిమా చేయాలంటే ఆ సినిమా బడ్జెట్ 40 లక్షలు అయ్యేది. ఇందులో NTR రెమ్యునరేషన్ 12 లక్షలు ఉండేది. అది అప్పట్లో సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్.
ANR:
ఈయన సినిమాకు 30 లక్షల బడ్జెట్ ఉంటే, రెమ్యునరేషన్ 10 లక్షలు.అంటే సినిమాలో ఒకటో వంతు ఉండేదన్న మాట.
కృష్ణ :
కృష్ణ సినిమా బడ్జెట్ 20 నుంచి 25 లక్షల వరకు ఉంటే అందులో ఆయన 7 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేవాడు.
శోభన్ బాబు:
సోగ్గాడిగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన శోభన్ బాబు సినిమాల బడ్జెట్ ,రెమ్యునరేషన్ లు కృష్ణ సినిమాతో సమానంగా ఉండేవి. ఈయన సినిమా బడ్జెట్ 20 లక్షలు అయితే అందులో 6-7 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకునేవాడు.