యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి ఆయన అభిమానులు హల్ చల్ చేశారు. బర్త్‌డే విషేస్ చేప్పేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ కు తరలివచ్చారు. ఎన్టీఆర్ ఇంటి ముందు హంగామా చేశారు. అభిమానుల హడావుడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
ఎన్టీఆర్ ఇంటి ముందే కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. ‘జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్’.. ‘హ్యాపీ బర్త్‌డే తారక్ అన్నా’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. మరోవైపు తారక్ ఇంటినుండి బయటకు రావాలంటు పిలిచారు. అయినా ఆయన బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
ఈ మేరకు తాజాగా.. ఎన్టీఆర్ స్పందించారు. అభిమానులకు క్షమాపణ చెప్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు ఎన్టీఆర్. తాను బయటకు రాకపోవడానికి కారణాన్ని వివరిస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు.
తాను ఇంట్లో లేకపోవడం వల్ల అభిమానులను కలవలేకపోయానని చెప్పాడు. తమను కలవలేకపోయినందుకు క్షమాపణ చెప్పారు తారక్. తనను అభిమానిస్తూ తన ఇంటికి వచ్చిన అభిమానులను కలలేకపోయినందుకు బాధగా ఉందని ఆవేదన చెందారు తారక్.