ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన బుచ్చిబాబు ఫస్ట్ సినిమాతోనే హిట్ అందుకోటం తో డైరెక్ట్ గా ఎన్టీఆర్ కు కథ చెప్పాడు. ఎన్టీఆర్ కూడా బుచ్చిబాబు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతకన్నా ముందు ఎన్టీఆర్ మరో రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పి ఉన్నాడు.
అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 30వ సినిమా కాగా… మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మరోవైపు తమిళ దర్శకుడు అట్లీ కూడా ఎన్టీఆర్ కు ఓ కథ చెప్పాడు.
అలాగే అల్లు అర్జున్ కి కూడా అదే కథ చెప్పాడు. ఈ ఇద్దరిలో ఎవరు ముందు డేట్స్ ఇస్తే వారితో ముందుగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు అట్లీ. అయితే బన్నీ ఎన్టీఆర్ కన్నా ముందు డేట్స్ ని ఇచ్చేశాడట. దీంతో బన్నీ తో సినిమా చేసేందుకు అట్లీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ మాత్రం ప్రశాంత్, కొరటాల సినిమాలు కంప్లీట్ అయ్యాక బుచ్చి బాబు ని లైన్ లో పెట్టాడ. అన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్పాడట. నిజానికి ఎన్టీఆర్, బుచ్చిబాబు ల తో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బుచ్చిబాబు ఎన్టీఆర్ ను ఏ విధంగా చూపించబోతున్నాడు ? సినిమా ఎలా ఉండబోతుంది ? అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులకు ప్రశ్నగా మారింది మరి చూడాలి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందో.