అప్పటి నటుల వ్యక్తిగత, సినీ జీవిత విశేషాలకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది. ఎన్టీఆర్ లాంటి నటులకు సంబంధించిన విషయాల గురించి అయితే ఫాన్స్ మరింత ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అలా ఎన్టీఆర్ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు చెప్పిన విషయాలు చూద్దాం. ఒకసారి ఏదైనా వింటే ఎన్టీఆర్ కు అలా గుర్తుండి పోతుంది అని ఇమంది పేర్కొన్నారు. ఎవరైనా సీరియస్ గా మాట్లాడుతున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఆయనకు నచ్చేది కాదన్నారు.
ఇష్టానుసారం కూర్చున్నా ఎన్టీఆర్ కు నచ్చదని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ బయటకు వెళ్లిన సమయంలో ఆయన బసవతారకం ఎదురు వచ్చేవారన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సెంటిమెంట్లను ఫాలో అయ్యేవారని వెల్లడించారు. ఎన్టీఆర్ కు తమ్ముడంటే ప్రేమాభిమానాలు ఎక్కువని చెప్పిన ఆయన ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి కూడా చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ కౌంజు పిట్టల మాంసం, చికెన్, మటన్, చేపలు అన్నీ తినేవారన్నారు.
తిండి పెడుతుంటే తింటూనే ఉంటారని అన్నారు. అట్లు, అరకేజీ జిలేజీ, బజ్జీలు తినేవారని అదే విధంగా పని కూడా చేసేవారన్నారు. 40 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ 8 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని, స్క్రీన్ చూడకుండా పేపర్ చూసి ఆయన డబ్బింగ్ చెప్పేవారని అన్నారు. ఒక సినిమా సమయంలో ఎన్టీఆర్ 29 కూల్ డ్రింక్స్ తాగారని 10 ప్యాకెట్ల సిగరెట్లు కాల్చారని ఒక సీన్ కోసం అలా చేశారని వివరించారు.