తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
మన తెలుగు భాష గొప్పతనం మనం గుర్తించం కానీ.. బ్రిటీష్ వాళ్లు ఆనాడే గుర్తించారు. అందుకు తార్కాణం వారు ముద్రించిన అణా.
“అణా” అని హింది, బెంగాలీ, ఉర్దూ భాషలతో పాటుగా తెలుగులో ముద్రించారు. మరే ఇతర భాషలను వాడలేదు. ఆ కాలంలో దేశంలో తెలుగు మాట్లాడేవారు మూడవ స్థానంలో ఉండేవారు.
ఇక.. తెలుగును విశ్వవిఖ్యాతం చేసిన మహనీయుడు యన్టీఆర్.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి యన్టీఆర్. హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్ కట్టపై తెలుగువారి విగ్రహాలు నెలకొల్పి జాతి రుణం తీర్చుకున్న ఈ మహనీయుడు 1994 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా చేసిన ప్రసంగం వినాలని వుందా..
ఇది మీకోసం ‘తొలివెలుగు’ సేకరించిన అమూల్య ప్రసంగం.