యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా RRR. రాజమౌలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2020 జూలై 30 న రేలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటున్న హీరో ఎన్టీఆర్. అయితే RRR సినిమా తరువాత త్రివిక్రమ్ తో లేదా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా తీస్తున్నాడని మొదట ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇంకో వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.
RRR సినిమా అయ్యాక ఓ కొత్త దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడట. ఇప్పటికే కథను విన్న ఎన్టీఆర్ కచ్చితంగా సినిమా చేస్తానని మాటఇచ్చాడట. RRR లాంటి పాన్ ఇండియా లెవెల్ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇలా కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నారని తెలుస్తున్న ఫాన్స్ అసంతృప్తితో ఉన్నారట. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ ఫిలింనగర్ లో గుస గుసలు మాత్రం వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ వార్త క్లారిటీ రావాలంటే ఎన్టీఆర్ స్పందించాల్సిందే.