సైరా డైరెక్టర్‌కు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వార్నింగ్ - Tolivelugu

సైరా డైరెక్టర్‌కు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వార్నింగ్

NTR Fans Fires On Director Surender Reddy, సైరా డైరెక్టర్‌కు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వార్నింగ్

సైరాతో హిట్‌ కొట్టి మంచి ఊపు మీదున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో అశోక్ సినిమా తీసేందుకు ఎన్టీఆర్‌ మేనేజర్ సుకుమార్ తనను బ్లాక్‌మెయిల్ చేశాడంటూ సంచలన కామెంట్ చేశారు సురేందర్‌ రెడ్డి. అంతేకాదు ఓవైపు ఎన్టీఆర్‌ను తిడుతూ… సాహో సినిమాను, ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సురేందర్ రెడ్డి.

దీంతో… ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సురేందర్‌రెడ్డిపై అటాక్ మొదలుపెట్టారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం సురేందర్ రెడ్డిది అని, బ్లాక్‌మెయిల్ చేసి అశోక్ సినిమా చేయిస్తే… అది ఫ్లాప్ అయినా ఊసరవెళ్లి సినిమా చేశారు కదా…? మరి అదేలా చేశారు అంటూ ఫైర్ అవుతున్నారు. ఊసరవెళ్లి సినిమా సమయంలో ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తి, ఇప్పుడు తిట్టడం చూస్తుంటే… సురేందర్‌ రెడ్డి ఎంటో అర్థమవుతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు మీరు ఫ్లాప్ సినిమాలు ఇస్తే… ఆయన మీకు రెండు సార్లు చాన్స్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు అంటూ మండిపడుతున్నారు.

తన ఇంటర్వ్యూలో సురేందర్‌ రెడ్డి… నా దృష్టిలో సాహో సినిమా ఫ్లాప్ కాదని, హిందిలో 150కోట్ల మార్కెట్ చేసిందంటూ ప్రభాస్‌ను పొగిడారు సురేందర్ రెడ్డి. సురేందర్‌ రెడ్డి తన కొత్త సినిమా ప్రభాస్‌తో చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో ఇప్పటికే వార్త హల్‌చల్ చేస్తున్న సమయంలో ప్రభాస్ పొగిడి, ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయబోయి… సురేందర్‌ రెడ్డి టార్గెట్ అయిపోయారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp