ఎన్టీఆర్ , రాంచరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ నటి అలియాభట్ నటిస్తుండగా ఎన్టీఆర్ పక్కన ఎవరు నటిస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తుందంటూ చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. అయితే చిక్కంతా ఇక్కడే వచ్చి పడింది.
అలియాభట్ లాంటి మంచి ఫేమస్ హీరోయిన్ ని రాంచరణ్ సరసన పెట్టి కనీసం వికీపీడియా లో పేజీ కూడా లేని ఒక హీరోయిన్ ని తీసుకొచ్చి, ఎన్టీఆర్ పక్కన నటించేది ఈమె అంటూ చెప్పటం పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ అసంతృప్తి తో ఉన్నారు. మరో వైపు మిగతా హీరోల ఫాన్స్ కూడా ఈ విషయంలో యంగ్ టైగర్ ఫాన్స్ ని ట్రోల్ చేస్తున్నారట.
మాములుగా రాజమౌళి, ఎన్టీఆర్ కన్నా ఎవరు ఎక్కువ కాదంటూ చెప్తుంటారు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి వీరి ప్రయాణం మొదలైన సంగతి తెలిసిందే. అలాంటి రాజమౌళి ఎన్టీఆర్ కు ఇలాంటి హీరోయిన్ ని పెట్టటం పై కారణం ఉండకపోదు. క్యారెక్టర్ కు తగ్గట్టుగానే రాజమౌళి సెలెక్ట్ చేసి ఉంటారని, అయినా ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి పక్కన ఎవరు నటిస్తే ఏంటంటూ మరి కొంత మంది ఫాన్స్ అనుకుంటున్నారు.