ఒకప్పుడు సినిమాల్లో స్టార్ హీరోలు అంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే వాళ్ళు. వరుస సినిమాలు చేసినా సరే ఆహారం, నిద్ర, వ్యాయామం అన్నీ కూడా పరిమితికి లోబడి చేసే వాళ్ళు. ఇక టూర్ కి వెళ్ళినా సరే ఏది పడితే అది తినే వాళ్ళు కాదు. అగ్ర హీరోలతో పాటుగా ఇతర కీలక నటులు కూడా ఇలాగే వ్యవహరించే వారు. ఇలా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకున్న వారిలో ఎన్టీఆర్ ఒకరు.
ఎన్టీఆర్ సినిమాల్లో నటించినన్ని రోజులు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విశ్రాంతి లేక ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ విషయంలో ఒక ఆసక్తికర విషయం ఏంటీ అంటే… ఆయన ఒక సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యానికి గురయ్యారట. పరమానందయ్య శిష్యులకథ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన ఇబ్బంది పడ్డారు. విజయ స్టూడియో లో ఈ సినిమా షూట్ జరిగింది.
ఆ సమయంలో షూటింగ్ లో అల్లు రామలింగయ్య, నాగయ్య ఇద్దరూ ఉన్నారట. అల్లుకి వైద్యం వచ్చు అనే విషయం నాగయ్యకు మాత్రమె తెలుసు. వెంటనే హోమియోపతి వైద్యం చేసారట. ఆస్పత్రికి తీసుకువెళ్ళాలా వద్దా అనే సందేహంలో ఉన్నప్పుడు నాగయ్య ఇచ్చిన సలహాతో వెంటనే అల్లు తనకు తెలిసిన వైద్యం చేయగా అయిదు నిమిషాల్లోనే ఎన్టీఆర్ కోలుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి తనకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా అల్లు సలహా తీసుకునే వారు.