అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఫార్మూలాను ఎన్టీఆర్ కూడా ఫాలో కాబోతున్నారు. అయితే సీనీయర్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్‌కు హిట్ కోసం బన్నీని ఫాలో కావటం ఏంటీ అనుకుంటున్నారా…?
బన్నీని ఫాలో అయ్యేది సినిమా హిట్ కోసం కాదు. తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కోసం. అవును… హరికా హసిని బ్యానర్ మొదలైనప్పటి నుండి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ బ్యానర్‌లోనే సినిమా చేస్తూ వస్తున్నారు. కానీ అల వైకుంఠపురములో సినిమాకు మాత్రం బన్నీ ఫ్యామిలికి చెందిన గీతా ఆర్ట్స్‌కు కొంత ఫ్రాఫిట్ షేర్ ఇచ్చారట. దాదాపు 40శాతం ఫ్రాఫిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నందమూరి కళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా కూడా హరికా హసిని క్రియేషన్స్ పతాకంలో నిర్మితమవుతున్నా… ఎన్టీఆర్ ఆర్ట్స్‌కు 40శాతం ఫ్రాఫిట్ షేర్ ఇవ్వాలని ఎన్టీఆర్ కోరినట్లు తెలుస్తోంది. అందుకు హరికా హసిని క్రియేషన్స్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.