నటుడిగా, నాయకుడిగా, ప్రజల మనిషిగా మనుషులకు నమూనాగా స్పెషల్ స్టాండర్డ్స్ సెట్ చేసిన వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్. నటజీవితంలో డైరెక్టర్స్ హీరో,ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ, అభిమానులకు గర్వంగా చెప్పుకునే నటుడు.
రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసి పేద ప్రజలకు ఎంతో మేలు చేసాడు. ఇప్పటికీ పేద ప్రజలు ఎన్టీఆర్ని దేవుడిగా కొలుస్తుంటారు. అయితే ఎన్టీఆర్ పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ముఖ్యంగా ఎన్టీఆర్ బసవతారకంను పెళ్లి చేసుకున్న తరువాత వీరికి ఎనిమిది మంది అబ్బాయిలు, నలుగురు కూతుర్లు జన్మించారు. ప్రధానంగా ఎన్టీఆర్ కి హిందూ ధర్మం ,ఆచారాలు, సంప్రదాయాలు, తెలుగు భాష అన్నా కూడా ఎంతో గౌరవం ఉండేది.
ఎన్టీఆర్, తన కొడుకులు, కూతుర్లకు, మనవరాల్లకి పెట్టిన పేర్లు చూస్తే తెలుగు పై ఆయనకు ఉన్న మక్కువ మనకు తెలుస్తుంది. కుమారులు, కూతుర్లు ఇలా అందరి పేర్లకు కూడా చివరన ప్రాస కుదిరేవిధంగా ఎన్టీఆర్ నామకరణం చేశారు.
ఏడుగురు కొడుకుల పేర్ల చివర కృష్ణ అనే పదం ఉండేవిధంగా పేర్లు పెట్టారు ఎన్టీఆర్. హరికృష్ణ, రామకృష్ణ, సాయికృష్ణ, జయకృష్ణ, బాలకృష్ణ అని ఇలా పేర్లు పెట్టారు. ఇక కూతుర్ల విషయానికొస్తే నలుగురు కూతుళ్ల పేరు చివర ఈశ్వరి అనే పేరు వచ్చేవిధంగా పేర్లు పెట్టారు.
లోకేశ్వరి, పురంధేశ్వరి, ఉమా మహేశ్వరి, భువనేశ్వరి అని పేరు చివర రి వచ్చే విధంగా నామకరణం చేశారు. ఇక రెండో తరంలో కూడా ఎన్టీఆర్ పెట్టిన పేర్లు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు జయకృష్ణ కుమార్తె పేరు కుదిమిని,రెండో కుమారుడికి ఇద్దరు కూతుర్లు ఉండగా వారి పేర్లు శ్రీమంతుని, మనశ్విని, నామకరణం చేశారు. బాలకృష్ణ ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మిణి, తేజస్విణి గా నామకరణం చేశారు.
చిన్న కుమారుడు సాయికృష్ణ కుమార్తె పేరు కూడా ఈషాణి అని ఎన్టీఆర్ పెట్టారట. ఇక పేర్లు వింటేనే ఎన్టీఆర్ ది ఎంత కళాత్మక హృదయమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.ఇలా ప్రాస కలిసే విధంగా ఇంతమందికి ఎవ్వరూ కూడా ఇలా పేర్లు పెట్టలేదనే చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఏది చేసినా అందులో ప్రత్యేకత ఉండడం విశేషం.
Also Read: సర్దార్ మూవీ అట్టర్ ఫ్లాప్