సినిమాల్లో నటించే హీరోయిన్లకు ఉండే కష్టాల గురించి మనకు పెద్దగా అవగాహన ఉండదు గాని వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు అనే మాట వాస్తవం. అనారోగ్యాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా వాళ్లకు క్యాన్సర్ అనే వ్యాధి పెద్ద శాపం లాంటిది అని కూడా అంటారు. ఇలా మన తెలుగు హీరోయిన్లు కొందరు క్యాన్సర్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు.
అందులో మమతా మోహన్ దాస్ కూడా ఒకరు. ఆమెకు క్యాన్సర్ వచ్చి తగ్గినా ఆ తర్వాత కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టాయి. సినిమాల్లో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదనే చెప్పాలి. ఇప్పుడు ఏదో కేరళలో సెటిల్ అయి అక్కడ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తుంది. క్యాన్సర్ నుంచి బయట పడిన ఆమెకు మరో వ్యాధి సోకినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే విటిలిగో అనే వ్యాధి.
ఆ వ్యాధి ఆమెకు సోకిన విషయాన్ని స్వయంగా ఆమెనే బయట పెట్టింది. తాను చర్మం రంగు కోల్పోయే వీటిలిగో అనే క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నట్టు చెప్పింది. ఇది ఒకరకంగా బొల్లి లాంటి వ్యాధి. ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని చెప్పింది. డియర్ సన్ నీ కిరణాలను చూడడానికి నీ కంటే ముందే నిద్రలేస్తున్నానని పోస్ట్ చేసింది. నీ శక్తినంత నాకు ఇవ్వండి ఎప్పటికి రుణపడి ఉంటాను అని పేర్కొంది.