ఇప్పటి హీరోలు, దర్శకులు, హీరోయిన్లు సినిమా షూటింగ్ కి ఆలస్యంగా వస్తారు అనే పేరు ఉంది. కొందరు హీరోలు అయితే అసలు షూట్ కి వస్తారో లేదో కూడా అర్ధం కాని పరిస్థితి. కాని అప్పట్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. క్రమశిక్షణ విషయంలో స్టార్ హీరోలు చాలా సీరియస్ గా ఉండేవారు. అందులో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమా షూటింగ్ కి గంట ముందు వచ్చేవారు.
మేకప్ వేసుకుని దర్శకుడి షాట్ కోసం రెడీ గా ఉండేవారు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే ఆయన వారసులకు కూడా వచ్చింది. ఇక ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో ఎవరైనా ఆలస్యంగా వస్తే వాళ్ళ మీద సీరియస్ అయ్యేవారు. ఎంతటి వారు అయినా మొహం మీద అడిగేసేవారు. ఆయన అలా సీరియస్ అయిన వారిలో సావిత్రి కూడా ఉన్నారు. సావిత్రితో సినిమాలు చేయడానికి దర్శకులు భయపడేవారు.
ఆమె అంటే చాలా మందికి గౌరవంతో పాటు భయం కూడా ఉండేది. అయితే ఎన్టీఆర్ ఒకసారి సావిత్రి మీద సీరియస్ అయ్యారట. పెత్తందార్లు సినిమాలో ఎన్టీఆర్ కు సావిత్రి వదినగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా సావిత్రి ఆలస్యంగా షూట్ కి వచ్చారు. కోపం ఆపుకోలేకపోయిన ఎన్టీఆర్… ఏవండీ, మీకేం అండీ, దర్జాగా వస్తారు… ఇక్కడ మేమేనా.. లేటుగా రాలేంది అని వెటకారంగా అనేసారు. ఇక ఆమెకు అప్పుడే పెళ్లి అయిన రోజులు కావడంతో దర్శకుడు ఏం అనలేదట.