ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడింది. జనవరి 7వ తేదీన రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగారిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేశారు మేకర్స్. దీంతో ఎన్టీఆర్ తన తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ కొరటాల శివతో 30వ సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచి కూడా మంచి హైప్ నెలకొంది. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సూపర్ డుపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక హ్యష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.
అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా అలియాభట్ ను ఫిక్స్ చేశారట. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారట.
అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట ఎన్టీఆర్.