యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇందులో సమంత, నిత్య మీనన్ హీరోయిన్స్ గా నటించారు. మోహన్ లాల్ సాయికుమార్ కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఇప్పుడు మరోసారి కొరటాల ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ బస్తీలో చదువుకునే స్టూడెంట్ లీడర్ పాత్రలో నటిస్తున్నాడట. రాజకీయ నాయకులు వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడగా అప్పుడు వారికి అండగా ఎన్టీఆర్ నిలబడి పోరాటం చేస్తాడట.
ఇక ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ జనవరిలో రిలీజ్ కు సిద్దమైంది. కానీ కరోనా కారణంగా అప్పుడు కూడా రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఏప్రిల్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
అలాగే ఎన్టీఆర్ కొరటాల సినిమాతో పాటు ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.