యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.
అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్, కీర్తి సురేష్, అలియా భట్, రష్మిక మందన్న ల పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనలైజ్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కావల్సి ఉండగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే ఎన్టీఆర్ లైనప్ లో కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు, త్రివిక్రమ్ వంటి వారు ఉన్నారు.