దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. భారీ విజయాన్ని సాధించింది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆర్ఆర్ఆర్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల యాక్టింగ్ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. చిత్ర యూనిట్ తో పాటు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా తనను రాజమౌళి మరింత రాటుదేల్చాడని చెప్పారు యంగ్‌టైగర్ ఎన్టీఆర్.
ఇక సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ గురించి ఆసక్తికరంగా మారాయి. రామ్‌చరణ్ లేనిదే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా లేదని, ఏకంగా భీం పాత్రకు చరణ్ చేసిన అల్లూరి పాత్రతోనే పరిపూర్ణత చేకూరిందన్నారు. అల్లూరి పాత్ర రామ్ చరణ్ కంటే బెటర్ ఇంకా ఎవరు చేయలేరన్న అభిప్రాయం వెల్లడించారు.
“ఆర్‌ఆర్‌ఆర్’పై మీరు చూపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు. ఈ చిత్రం నా కెరీర్‌లో లాండ్‌మార్క్‌గా నిలిచింది. పాత్రలో ఒదిగిపోయేలా స్ఫూర్తినిచ్చిన జక్నన్న థ్యాంక్స్. జక్కన్నా.. నాలోని నటుడిని బయటకు తీసుకొచ్చి, పాత్రకు తగ్గట్టు నన్ను నీరులా మార్చావు. చరణ్.. నువ్వులేనిదే ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ఊహించుకోలేను. నువ్వులేనిదే ఈ సినిమానే లేదు.. నా పాత్ర కొమురం భీమ్ కూడా అంత అద్భుతంగా వచ్చేది కాదేమో! అల్లూరి సీతారామరాజు పాత్రకు నవ్వు తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు” అని ఎన్టీఆర్ లేఖలో అన్నారు.
రాజమౌళి, చరణ్ సహా సినిమాలో నటించిన అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, ఒలివియా మోరిస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్. నిర్మాత దానయ్య, సంగీత దర్శకుడు కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, సెంథిల్, సాబూ సిరిల్, శ్రీనివాస మోహన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, కార్తికేయ, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్‌లకు ధన్యవాదాలు చెప్పారు. ఇండస్ట్రీకి, మీడియా, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకరిపై మరొకరు ప్రేమ కనబరిచారు. ఇద్దరూ సొంత బ్రదర్స్ కంటే మిన్నగా మెలిగారు. తాజా లేఖతో చరణ్‌పై ఎన్టీఆర్‌కి ఎంత అభిమానం ఉందో మరోసారి రుజువైంది.
I’m touched beyond words… pic.twitter.com/PIpmJCxTly
— Jr NTR (@tarak9999) March 29, 2022
Advertisements