అప్పట్లో పౌరాణిక సినిమాలు అనగానే ఎన్టీఆర్ కళ్ళ ముందు ఉండేవారు. ఆయన ఎన్నో సినిమాలు చేసి హిట్ కొట్టారు. ఇక కైకాల సత్యనారాయణ ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన యమగోల సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రావడానికి ముందు పెద్ద కథ ఉంది. అసలు ఏంటీ అనేది చూస్తే… పల్లవి ఫిలిం అధినేత వెంకటరత్నం ఎన్టీఆర్‌కు దూరపు బంధువు అవుతారు.
డివి నరసరాజు ఆధ్వర్యంలో ఆయన ఒక కథ రెడీ చేసారు. శోభన్ బాబుని హీరోగా పెట్టి ఈ సినిమా చేయాలి అనుకున్నారు. హీరోయిన్లుగా జయప్రద, జయసుధలను తీసుకోగా…శోభన్ బాబుకి కథ చెప్తే ఆయన నో అన్నారు. రాజ్ కుమార్ హీరోగా కన్నడలో సూపర్ హిట్ అయిన గంధద గుడి సినిమానే కొంచెం మార్పులు చేసారు. శోభన్ బాబు నో చెప్పడంతో వెళ్లి ఎన్టీఆర్ తో మాట్లాడారు. ఆయన ఓకే చెప్పడంతో సినిమా షూట్ కి వెళ్ళాలి అనుకున్నారు.
రాఘవేంద్రరావు దర్శకుడుగా… ఎన్టీఆర్ ను యముడిగా తీసుకున్నారు. యువ హీరోగా బాలకృష్ణను తీసుకుందామని అనుకోగా… ఎన్టీఆర్ నేనే హీరోగా చేస్తాను… యముడిగా సత్యనారాయణను తీసుకోవాలని చెప్పారట. అలా కామెడీ సినిమాగా వచ్చి అప్పట్లో సంచలనం సృష్టించింది. అనవసరమైన సెంటిమెంట్ లేకుండా ఈ సినిమా చాలా బాగా జనాల్లోకి వెళ్లి హిట్ అయింది.