ఎన్టీఆర్ కొత్త సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ బయటకొచ్చాయి. లెక్కప్రకారం ఈపాటికే సెట్స్ పైకి రావాల్సిన ఈ సినిమా మరో నెల రోజులు ఆలస్యంగా సెట్స్ పైకి రాబోతోంది. దీనికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఇక లేటెస్ట్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ఎన్టీఆర్-కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మార్చి 20 నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ నెలాఖరుకు లేదా వచ్చేనెల ఈ సినిమా ఓపెనింగ్ ను గ్రాండ్ గా చేయబోతున్నారు.
ఈ సినిమాకు బల్క్ లో కాల్షీట్లు కేటాయించాడు తారక్. అంటే, ఈ సినిమా షూటింగ్ టోటల్ గా (ప్యాచ్ వర్క్ తో సహా) పూర్తయ్యేవరకు మరో సినిమా పైకి వెళ్లడన్నమాట.
అటు కొరటాల కూడా, ఈ సినిమాకు 6 నెలలు టార్గెట్ గా పెట్టుకున్నాడు. 180 రోజుల్లో షూట్ పూర్తిచేసి, సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనేది టార్గెట్.
ఈ సినిమాతో యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కు వస్తోంది. ఇక అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు.