యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఇప్పుడు మరో సినిమాని ఎన్టీఆర్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ కి చెందిన ఇంటెన్స్ సినిమాల దర్శకుడు వెట్రిమారన్ తో తారక్ ఓ సినిమా చేయనున్నాడని ఇప్పుడు వైరల్ అవుతుంది. తెలిసిన ఫ్యాన్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
వెట్రిమారన్ పేరు తన అసురన్ తెలుగులో నారప్ప గా రీమేక్ అయ్యిన తర్వాత నుంచి టాలీవుడ్ బాగానే వినిపిస్తుంది.