ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తోపాటు, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కాగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టడంతో మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి కాగానే తారక్ త్రివిక్రమ్ తో జత కడతారని ఫిక్స్ అయిన సమయంలోనే .. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. దాంతో త్రివిక్రమ్ తో జత కట్టేందుకు ముందే మరో సినిమా చేయాలనీ ఎన్టీఆర్ భావిస్తున్నాడట.
తమిళ్ లో అసురన్ ను తెరకెక్కించిన వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వెట్రిమారన్ ఎన్టీఆర్ కు కథను కూడా వినిపించగా.. పూర్తి కథను రెడీ చేయాల్సిందిగా తారక్ కోరినట్లు సమాచారం. ఇప్పుడు కథను సిద్ధం చేసే పనిలో వెట్రిమారన్ ఉన్నారని.. అందుకోసం ఆయన అదిరిపోయే స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఇంతకు ఎవరితో ఎన్టీఆర్ ముందుగా సినిమా చేస్తాడో చూడాలి..