యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కార్లంటే ఎంతో ఇష్టం. తనకు షూటింగ్స్ లేని సమయంలో తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ చక్కర్లు కొడుతుంటారు. ఇప్పటికే తన ఇంట్లో ఎన్నో కార్లుండగా… తాజాగా లాంబర్గిని కారు కొనుగోలు చేశారు. ఈ మోడల్ ఇండియాలోనే మొదటిది కావటం విశేషం.
తనకు ఎన్ని కార్లున్నా వాటన్నింటికి 9999 నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అంటే తనకు ఎంతో ఇష్టం. సీనియర్ ఎన్టీఆర్ కూడా ఈ నెంబర్ ను ఎంతో ఇష్టపడేవారని… అదే సెంటిమెంట్ తనకు కూడా అలవాటైందని తను కూడా కామెంట్ చేస్తుంటాడు.
తాజాగా కొన్న కారుకు 9999 నెంబర్ కోసం ఎన్టీఆర్ ఖైరాతాబాద్ ఆఫీసుకు వచ్చి వేలంలో పాల్గొన్నారు. 17లక్షల రికార్డు ధరతో టీఎస్09 ఎఫ్ఎస్ 9999 నెంబర్ దక్కించుకున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ పూర్తి చేసే ఎవరు మీలో కోటిశ్వర్లు షో చేస్తున్నారు. త్వరలోనే డైరెక్టర్ కొరటాలతో సినిమా స్టార్ట్ చేయనున్నారు.